వలేటివారిపాలెం మండలం శామీరపాలెం (కూనిపాలెం) గ్రామంలో గంగమ్మ తల్లి తిరుణాల సందర్భంగా నిర్వహిస్తున్న….
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం, బాపట్ల జిల్లాల స్థాయి ఎడ్ల పందేలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. మొత్తం ఏడు జతల ఎడ్లు, ఈ పందేలలో పాల్గొన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు ఈ పందేలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఎద్దులు కుటుంబ సభ్యులులాంటివని, పండుగ వాతావరణంలో ఇలాంటి పందేలు నిర్వహించటం ఆనందంగా ఉందని అన్నారు. పల్లెల్లో రైతుల ఆచార సంప్రదాయాలను తప్పకుండా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అప్పుడే నేటి తరానికి వాటిపై అవగాహన కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, మాజీ సర్పంచ్ నవులూరి రాజా రమేష్, గ్రామ నాయకులు అనుమోలు సుధాకర్, నేతి నరసింహం, మానికొండ మాధవరావు, తాటికొండ రమణయ్య, ఘట్టమనేని మాల్యాద్రి, చెంచునాయుడు, క్లస్టర్ ఇంచార్జి కాకుమాని హర్ష, ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.