తొలి శుభోదయం న్యూస్ కావలి :-
ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్రలు ఆదివారం కావలి పట్టణం ఇందిరానగర్ లో ప్రారంభించిన సిపిఐ నేత బిల్లా పురుషోత్తం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సొంత ఇల్లు లేని పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇంటి స్థలం పక్క గృహాలు ఇవ్వలేదని నిరుద్యోగ భృతి మహిళలకు 1500 రూపాయలు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక బలోపేతం రెండేళ్ల పాలన కాలంలో హామీలు అమలు చేయలేదని మోసపూరిత హామీలు ఇచ్చారని తెలిపారు పెరిగిన ఇంధనం విద్యుత్ వంటగ్యాస్ నిత్యవసర వస్తువు ధరలు నియంత్రించే సామాన్య ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలని అవినీతిరహిత పాలన కావాలని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందని ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన నిధులు సిబ్బంది మౌలిక వసతులు కల్పించకుండా ప్రైవేట్ వ్యవస్థ పై ప్రజలు ఆధారపడేలా చేస్తున్నారని ప్రభుత్వ వైద్యం పేదలకు అందడం లేదని పట్టణంలో తాగునీరు మౌలిక సౌకర్యాలు కల్పించాలని మహిళలపై జరుగుతున్న దాడులు బాలికలపై నేరాలను అరికట్టడంలో విఫలం అయ్యారని ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ నియమాకాలు చేపట్టకుండా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాలు ప్రోత్సహించడం వల్ల యువత భవిష్యత్తులో చీకట్లోకి నెట్టి వేస్తున్నారు అన్నారు గ్రీవెన్స్ సెల్లులో ప్రజా సమస్యల పరిష్కారం కావడం లేదని సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు ఈ కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నాయకులు మండ్ల వెంకటేశ్వర్లు పుల్ల ఆదినారాయణ సిపిఐ కావలి డివిజన్ సహాయ కార్యదర్శి దమ్ము దర్గా బాబు కే బోయసు మళ్లీ అంకయ్య తదితరులు పాల్గొన్నారు