తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు స్థాయి సమావేశం… బీద రవిచంద్ర గారి అధ్యక్షతన నెల్లూరులోని మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగింది. మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ కోఆర్డినేటర్ మరియు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కాకర్ల సురేష్ గారు, దగుమాటి కృష్ణారెడ్డి గారు, కురుగొండ్ల రామకృష్ణ గారు, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి గారు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో పార్లమెంట్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెండింగ్ పనుల గురించి చర్చించారు. అలాగే డోర్ టు డోర్ ప్రచారం, పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు.ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను నేతలందరూ తిప్పికొట్టాలని, ముఖ్యంగా డీఎస్సీ విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని నేతలు నిర్ణయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *