తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, పార్కులు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా చేపట్టారు.
మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవలకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.