తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్., గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఐ షేక్ మహబూబ్ బాషా మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు.అక్రమ కోడి పందేల నిర్వహణపై ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సంతనూతలపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలంపాడు గ్రామ శివారులో చేపట్టిన దాడిలో కోడి పందేలు ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 కోళ్ళు 7 సెల్ ఫోన్లు Rs9500/- నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై స్థానిక పోలీసులకు, డయల్ 112 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వారిని తదుపరి చర్యల నిమిత్తం సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.