ఉలవపాడు మండలం కరేడు పంచాయితీలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో…. గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటి ప్రచారం, ఓటర్ల జాబితా సవరణలు, పెద్ద పంచాయతీ అయిన కరేడులో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నాయకులందరూ ఐక్యమత్యంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో క్లస్టర్ ఇంచార్జి పోలుబోయిన శ్రీనివాసులు, పార్టీ నేతలు చెంచురామిరెడ్డి, మెట్టా శ్రీనివాసరెడ్డి, యూనిట్ ఇన్చార్జులు కోటంగారి బాలమురళి, తేజ, రాచగర్ల శివ, పంచాయతీలోని అన్ని గ్రామాల నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *