బుచ్చిరెడ్డిపాళెంలో NH-67పై రూ.14 కోట్లతో లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్స్, సీసీ డ్రెయిన్లు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు NHAI అధికారికంగా ఆమోదం తెలిపినందుకు NHAI ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ గారికి కోవూరు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ సమస్య తీవ్రతను గుర్తించి, బుచ్చిరెడ్డిపాళెం ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు.ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడి, ప్రజలకు, వ్యాపారులకు, ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *