ప్రకాశం, మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు, విద్యార్థినులు భయరహిత వాతావరణంలో సంచరించేలా చర్యలు చేపడుతూ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, ప్రజలు అధికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.డ్రోన్ నిఘా ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షిస్తూ, మహిళలను వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *