తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గుడ్లూరు మండలంలోని సెక్టార్ లోని ఏలూరుపాడు పంచాయతీ నందు సిడిపిఓ మాధవి లత ఆదేశాలు మేరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భిణీ స్త్రీలకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడమైనది పుట్టిన మొదటి గంటలోపే తల్లిపాలు బిడ్డకు పట్టించాలి అని తెలియజేయడమైనది తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన బెడ్ కిరోక నిరోధక శక్తిని పెంపొందించి అంటువ్యాధుల నుండి రక్షిస్తాయని తెలియజేయడమైనది తల్లిపాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండి సరైన ఉష్ణోగ్రతలు ఉండి కలుషితం కాకుండా సిద్ధంగా ఉంటాయి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఆప్యాయత భద్రతను పెంచే అమూల్యమైన బంధం ఏర్పడుతుంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వలన డయేరియా నిమోనియా ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి తల్లిపాలు తాగే బిడ్డలు ఆత్మవిశ్వాసం మానసిక ప్రశాంతత భావోద్వేగ వికాసం మెరుగ్గా ఉంటుంది మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి ఇంకా ఇతరహార పదార్థాలు పెట్టకూడదు తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు మెదడు శరీర ఎదుగుదల తెలివితేటలు జ్ఞాపకశక్తి అభివృద్ధికి తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయి తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డల్లో దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తాయి ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన సంపూర్ణ ఉచిత పోషకాహారమే తల్లిపాలు తల్లిపాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా ఎదిగి ఊబకాయం మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుండి బయటపడతారు అని తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి పంచాయతీలోని కార్యకర్తలు పి తిరుపతమ్మ మాలకొండమ్మ ప్రసన్న హాజరైనారు