అద్దంకి–దర్శి రోడ్డులోని శంకరాపురం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.అదే సమయంలో దర్శికి వెళ్తున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డా” గొట్టిపాటి లక్ష్మీ గారు, డా” కడియాల లలిత్ సాగర్ గారు ప్రమాదాన్ని గమనించి తక్షణమే స్పందించి,
క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, 108 అంబులెన్స్ ద్వారా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన డా”లక్ష్మీ, యువనాయకులు డా ” లలిత్ సాగర్ దంపతులను పలువురు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *