తొలి శుభోదయం న్యూస్ కంభం:-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.కంభం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంభం మండలం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నాటిన మొక్కలను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.