తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు టిడిపి కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 34, 79, 775 రూపాయల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 9 మందికి 3,39,780/-
కందుకూరు రూరల్ – 7 మందికి 4,09,652 రూపాయలు,
గుడ్లూరు మండలం – 5 మందికి 2,42,250 రూపాయలు, లింగసముద్రం మండలం – 9 మందికి 5,90,251 రూపాయలు,
ఉలవపాడు మండలం – 10 మందికి 3,78,250 రూపాయలు,
వలేటివారిపాలెం మండలం – 11 మందికి 4,66,022 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఆరుగురికి తక్షణ వైద్యం కోసం 10, 53,580 రూపాయల విలువైన చెక్కులను అందించారు. కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,677 మందికి 12.87 కోట్లు మంజూరు చేయించామని నాగేశ్వరరావు తెలిపారు.