డీఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగ యువత విద్యార్థులు విద్యావేత్తలు ప్రజాస్వామ్యవాదులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 టీచర్ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 10-08-2026న ఉదయం పదిగంటలకు కందుకూరు పట్టణములో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండలాల కన్వీనర్లు ముఖ్య నాయకులతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బుర్రా. మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించినున్న ర్యాలీ స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ వద్ద నుండి ప్రారంభమై సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.విద్యార్థులు యువకులకు మద్దతు తెలుపుతూ డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చిందని, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే విద్య మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వయిరీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. పదో తారీకున జరిగే నిరసన ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, అభిమానులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు తదితరులు పాల్గొనాలని తెలిపారు.