తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు రాత్రి వేళల్లో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ప్రయాణికులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నేరాల నివారణకు రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.