తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి
మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, ట్రాఫిక్ నిబంధనల పాటింపును క్షుణ్ణంగా పరిశీలించారు.రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా ఈ వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.“ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – ప్రమాదాలను నివారిద్దాం – సురక్షితంగా ప్రయాణిద్దాం.”