ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ సిటీ పరిధిలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో బిజెపి నాయకుల అక్రమ కేసు బనాయించడం పిరికిపందల చర్యని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ సిటీ పరిధి లోని రామ్ లీలా మైదానంలోఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున కార్గే గారు ర్యాలీ నిర్వహించిన ప్రదేశంలో “శుద్ధి కర్ణ “పేరుతో బిజెపి మత ఇద్వేషానికి పాల్పడటాన్ని, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడాని,అంటరానితనాన్ని బిజెపి ప్రోత్సహిస్తుందని ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడిన వారిపై ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ ఈనెల 29 తేదీన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బిజెపి దాని అనుబంధ సంఘాలు చేస్తున్న మతవిద్వేషాలని విమర్శిస్తే తట్టుకోలేని బిజెపి గుండా మూకలు రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని దీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సైదా అన్నారు. వెంటనే ఈ ఎఫ్ ఐ ఆర్ ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాయని సైదా తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *