యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కృష్ణాజలాలకు జలహారతి, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, డా. లలిత్ సాగర్ గారు.1996 మార్చి 5న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు… సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం కలిగించే ఈ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉంది.కృష్ణమ్మకు హారతి ఇచ్చి, పసుపు, కుంకుమ, చీర సమర్పించిన ఈ పవిత్ర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. గిరిజన మహిళలు, చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వెలిగొండ జలాలతో ప్రకాశం జిల్లా రైతుల చిరకాల స్వప్నం సాకారం… ఇక సాగు, తాగునీటికి మరింత భరోసా! ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఎంపీ శ్రీనివాసరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *