పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో సెప్టెంబ 4 వ తేదీన ఆలయ ధర్మకర్తల మండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతం లో భక్తులు ప్రత్యేకంగా సుహాసినులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రంగ రాజు కోరారు. సెప్టెంబర్ 4 వ తేదీన కృష్ణ పక్షం అష్టమి నాడు ప్రత్యేకంగా సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగిందని మీడియా ప్రకటనలో తెలిపారు. సామూహిక వరలక్ష్మి వ్రతం సందర్భంగా వ్రతంలో పాల్గొనే వారికి దేవస్థానం ఉచితంగా అమ్మవారి ప్రతిమను అందజేస్తుందని వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రి భక్తులు స్వయంగా తమ వెంట తెచ్చుకోవాలని చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు కార్యనిర్వహణ అధికారి రంగరాజు భక్తులను కోరారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనాలి వారు సెప్టెంబర్ నెల మూడవ తేదీ సాయింత్రం లోపు తమ పేర్లను దేవాలయ ప్రాంగణం లోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు.భక్తులు విశేషంగా ఈ కార్యక్రమం లో పాల్గొని లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *