‌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు పురస్కరించుకుని కందుకూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ళ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పవన్ కల్యాణ్ గారి ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు అనుసరించి కేంద్ర కార్యాలయం (మంగళగిరి)వారి ఆదేశాల మేరకు ఉదయం 9 :30 గంటలకు కందుకూరు కోటా రెడ్డి సెంటర్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించి పోస్టాఫీసు సెంటర్ మీదుగా పామూరు బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ కూడలి నుంచి అంకమ్మ తల్లి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పడమటి బలిజ పాలెం వరకు బైక్ ర్యాలీ డిజే సౌండ్స్ తో జనసేన శ్రేణుల ఉవ్వెత్తున ఎగసిన సమర ఉత్సాహంతో హోరెత్తింది. జనసేన శ్రేణులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక జనసేన ముఖ్య నాయకులు కూటకుళ్ళ కల్యాణ్ దారం పవన్ కుమార్ మూలగిరి శ్రీనివాస్ సహకారం తో ఐటీ కో ఆర్డినేటర్ బింకం నరేంద్ర పర్యవేక్షణ లో కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ర్యాలీ అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి గుడి లో జనకనీల గోత్రోద్బవుడు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారి ఆయు ఆరోగ్యాలు బాగుండాలని పూజలు నిర్వహించారు . మొక్కలు నాటారు.తదనంతరం అన్న సంతర్పణ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *