తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని రాఘవ కోచింగ్ సెంటర్ లో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న కె.దివ్య అనే పేద విద్యార్థినికి కోచింగ్ ఫీజు నిమిత్తం సంస్థ తరఫున 10000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు నూతన వస్త్రాలు అందజేయటం జరిగినది. కాసింబి అనే అంధ విద్యార్థినికి పుస్తకాలు కొనుగోలు నిమిత్తం సంస్థ డైరెక్టర్ దేసు వెంకటసుబ్బారావు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ చదువు పేదరికం అడ్డు కాకూడదని బాగా చదువుతున్న పేద విద్యార్థులకు మా సంస్థ అండగా ఉంటుందని అన్నారు . ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పాలి మానవతా విలువలు అలవర్చాలి ఐక్యమత్యం బోధించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సంస్థ జిల్లా ప్రతినిధి తమటం రామిరెడ్డి, వైస్ చైర్మన్ పతకమూరి శరభలింగాచారి, కన్వీనర్ డి.చంద్రశేఖర్, కోశాధికారి ఎం.భోజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, డైరెక్టర్లు కనకదుర్గ, నాగలక్ష్మి, దేసు వెంకట సుబ్బారావు, కొండయ్య, పివి సుబ్బారావు, తన్నీరు సురేష్, కోసూరి శ్రీదేవి, చెరుకూరి ఆదిలక్ష్మి, వడ్డేంపూడి రాజేశ్వరి,సరస్వతి సూదున గుంట బుజ్జి తదితరులు పాల్గొన్నారు.