డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి!
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ఒంగోలు తాలూకా పోలీసుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో CASO కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు తాలూకా సీఐ గారు ప్రజలతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.యువత డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.అలాగే, పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించరాదని, రహదారి భద్రతా నియమాలను పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజలు పోలీసులకు సహకరిస్తూ డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని ఒంగోలు తాలూకా సీఐ గారు సూచించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం – అవగాహనతోనే నేరాల నివారణ సాధ్యం.