టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరుకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డా. కె.వి. పద్మావతి గారికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవి కుమార్ తెలియజేశారు.డా. పద్మావతి గారు గత ఐదు సంవత్సరాలుగా మన కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారని, కళాశాల విద్యాశాఖ విభాగంలో ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారని ఆయన తెలిపారు.పద్మావతి గారు తన 30 సంవత్సరాల సుదీర్ఘ బోధనానుభవంతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని, రసాయన శాస్త్రంలో పలు పరిశోధనా పత్రాలను ప్రతిష్టాత్మక జర్నల్స్ లో ప్రచురించారని, ప్రస్తుతం పలువురు పరిశోధక విద్యార్థులకు Ph.D. పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.అంతేకాకుండా జాతీయ సేవా పథకం (NSS) కోఆర్డినేటర్ గా, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం, ఒంగోలు వారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా సేవలందించారని, స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్టులో మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు.ఈ అవార్డు రావడం కళాశాలకు గర్వకారణమని, డా. పద్మావతి గారిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *