తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అర్ధవీడు మండలం లో వినాయకుడి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలకు తెలిపారు. ముందుగా గిద్దలూరు మండల ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు సిఐ మల్లికార్జున తెలిపారు. వినాయకుడి విగ్రహాలతో కూడుకున్న మండపాలను ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందస్తు అనుమతులను ఆన్లైన్లో తీసుకోవాలన్నారు. డీజే సౌండ్ సిస్టం పెట్టుకోవటానికి ఎటువంటి అనుమతులు లేవని అలా ఎవరైనా సప్లయర్స్ నిర్వహకులు డిజె సౌండ్ సిస్టం అద్దెకి ఇవ్వడం చేస్తే స్వాధీనం చేసుకొని కోర్టులో అప్పగిస్తామని సిఐ హెచ్చరించారు. ఇక వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు కమిటీగా ఏర్పడి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, పోలీసు, సంబంధిత అధికారుల వద్ద నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందన్నారు. అంతేకాకుండా వినాయకుడి మండపాల వద్ద ప్రతిరోజు రాత్రి వేళల్లో ఒక్కరైనా సరే కాపులా ఉంటూ రక్షణగా ఉండవలసి ఉంటుందన్నారు. ఇక సీసీ కెమెరాలు కూడా వినాయకుడి మండపాల వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. పండగను ప్రశాంతంగా చేసుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ మల్లికార్జున హెచ్చరించారు…..