ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ ప్రతాపరెడ్డి…
తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-
మర్రిపూడి మండలంలోని గార్ల పేట వేమవరం కూచిపూడి గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చింత ప్రతాపరెడ్డి. మంగళవారం కమిషనర్ గార్లపేటలోని అంగన్వాడి కేంద్రాలను స్వయంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. వేమవరం అంగన్వాడి కేంద్రంలో 24 మంది పిల్లలు ఉండడంతో సంతోష్ వ్యక్తపరిచి గ్యాస్ స్టాండ్ లేని కారణంగా అంగన్వాడీ కార్యకర్తకి 2000 నగదు బహుమతిగా అందజేసి స్టాండ్ ఏర్పాటు చేసుకోమని చెప్పడమే కాకుండా ఇంకా పిల్లలను ఎక్కువ మందిని చేర్చుకొని సెంటర్ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కూచిపూడి లో రేషన్ షాప్ ని సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.కమిషనర్ ప్రతాపరెడ్డి వెంట డి సి డి ఓ హేమలత.డిప్యూటీ డిఇఓ రంగయ్య.ఐ.సి.డి.ఎస్.పి డి. ఏ.పద్మ సునంద.ఐసిడిఎస్ సిడిపిఓ సుశీల దేవి.పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.