ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జెడ్పీ హైస్కూల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మహిళలు మరియు బాలికల భద్రత, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు OTPలు, బ్యాంకింగ్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు.విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు.విద్యార్థుల భద్రతే లక్ష్యం – అవగాహనతోనే సురక్షిత సమాజం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *