వర ప్రసాద్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
మాజీ ఎంపీటీసీ, సీనియర్ టీడీపీ నాయకులు గోకనగుండ వర ప్రసాద్ మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం జరుగుమల్లి మండలం దావగూడూరులో మాజీ ఎంపీటీసీ, సీనియర్ టీడీపీ నాయకులు గోకనగుండ వర ప్రసాద్ పార్థివ దేహానికి మంత్రి డా.స్వామి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….
గోకనగుండ వర ప్రసాద్ అకాల మృతి బాధాకరమన్నారు. వర ప్రసాద్ మృతితో టీడీపీ క్రమశిక్షణ గల నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన టీడీపీకి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వర ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ దేవున్ని ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు.