తొలి శుభోదయం న్యూస్ కొండపి :
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా కొండపిలో కొవ్వొత్తులు వెలిగించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలుగు ప్రజలందరికీ నేడు చీకటి రోజు, సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే రోజున చేయని తప్పుకు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్టు చేశారు. ఆ రోజే వైసీపీ పతనం ప్రారంభమైంది. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నిరసనలు తెలిపారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా చంద్రబాబు జైలు నుంచి బయటకి వచ్చారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందనేదానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తోనే ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఫ్యాన్ రెక్కలు విరిచారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.