తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా బుధవారం రాత్రి…. నిజం గెలిచింది కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం కక్షగట్టి మూడేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలుకు పంపిందన్నారు. ఎలాంటి అవినీతి జరగకపోయినా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారిని దోషిగా చూపించేందుకు ప్రయత్నించిందన్నారు. 53 రోజులపాటు అక్రమంగా జైలులో ఇబ్బందులు పెట్టారని నాగేశ్వరరావు అన్నారు. తెలుగు ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది చంద్రబాబు గారికి సంఘీభావం తెలిపారన్నారు. ఆ సంఘటనతో మొదలైన చైతన్యం… జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేంతవరకు కొనసాగిందని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు గారి జైలుకు పంపిన రోజును, చీకటి రోజుగా ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా… గుండె ధైర్యంతో, ప్రజా బలంతో చంద్రబాబు గారు 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు గుర్తుచేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తోందని ఎమ్మెల్యే గారు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *