తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
కురిచేడు మండలం, ఆవులమంద పంచాయతీ పరిధిలోని ప్రతిజ్ఞపురి కాలనీలో టీడీపీ కార్యకర్త చదమల అంజమ్మ గారు ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించారు. ఆమె టీడీపీ సభ్యత్వం పొంది ఉండటంతో, టీడీపీ ప్రమాద బీమా ద్వారా రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల భద్రతకు టీడీపీ అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని, టీడీపీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రమాదవశాత్తూ ఆపద జరిగినా రూ.5 లక్షల ప్రమాద బీమా రక్షణ లభిస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.