గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా భద్రత, POCSO చట్టంపై అవగాహన
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
పుల్లలచెరువు ఎస్‌ఐ గారు ముతుకుల గ్రామంలోని రాఘవేంద్ర పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై, వారి భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత వంటి అంశాలను వివరించారు. ఏదైనా అసౌకర్యకరమైన పరిస్థితి ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ఆన్‌లైన్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు మరియు బాలికల భద్రత, POCSO చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు తమ చుట్టూ జరిగే అనుమానాస్పద పరిణామాలను గమనించి, అవసరమైనప్పుడు వెంటనే పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సురక్షితమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని పోలీసులు తెలిపారు.విద్యార్థుల భద్రతే మా బాధ్యత.. అవగాహనే రక్షణకు తొలి అడుగు!