అనుమానితులు, నేరస్థుల గుర్తింపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం – పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ,“ఫేస్ వాష్” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్నారు. నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నేరాలకు సంబంధించిన వ్యక్తులను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడే విధానంపై దృష్టి సారిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు, నేర కార్యకలాపాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.టెక్నాలజీతో నేర నియంత్రణ.. ప్రజల భద్రతే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *