దర్శి డీఎస్పీతో కలిసి నిమజ్జన పాయింట్ల పరిశీలన – భక్తుల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు
గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) గారు దర్శి డీఎస్పీ గారిని కలిసి, ఎన్‌ఎస్‌పీ కాలువ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జన పాయింట్లను పరిశీలించారు.
నిమజ్జన ప్రాంతాల్లో భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిమజ్జన సమయంలో ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, వెలుతురు, బారికేడింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షితంగా, ప్రశాంతంగా గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *