తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అత్యంత పవిత్రమైన బుద్ధికి, జ్ఞానానికి ప్రతీకైన, విఘ్నాలను తొలగించే, విఘ్నేశ్వరుడైన వినాయక శ్రీగణాధిపతిని భక్తి శ్రద్దలతో పూజించి శివపుత్రుని కృపా, కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికి మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ ,కందుకూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ శ్రీ బుర్రా.మధుసూదన్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు.
నియోజకవర్గంలోని రైతులు, కూలీలు, కార్మికులు ఏ పని అయినా మొదలు పెట్టుముందుగా వినాయకుడికి ప్రధమ పూజ చేసి విఘ్నేశ్వరుని దీవెనలు పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి పకృతిని పరిరక్షించాలని కోరారు. వినాయక చవితినాడు భగవంతునికి ఇష్టమైన కుడుములు,ఉండ్రాలు,లడ్డులు, మోదకాలను నైవేద్యంగా సమర్పించి సంప్రదాయ బద్ధకంగా మంచి నీటిలో భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేయాలని సూచించారు.