తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
హిందూ సంప్రదాయంలో, ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా… తొలిపూజ చేసేది ఆ విఘ్నేశ్వరుడికే.అందరి జీవితాల్లో, కష్టాలనే విఘ్నాలను తొలగించి… సరికొత్త విజయాలకు నాంది పలికే గణేశుడి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంతోషాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మన నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు… ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో శోభిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు మేలు జరిగేలా బొజ్జ గణపయ్య ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ…