వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వరుడు, గణనాథుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులతో జిల్లా ప్రజల జీవితాల్లో సకల శుభాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధితో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.అదేవిధంగా జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన భద్రతా సూచనలు,నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, అలాగే నిమజ్జన కార్యక్రమాలను కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ సూచనల మేరకు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గారు మరోసారి ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *