తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఒంగోలు డీఎస్పీ గారు, ఒంగోలు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేలా నిర్వాహకులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. విగ్రహాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు మరియు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, జనసమ్మర్ధం నియంత్రణ, శబ్ద కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఒంగోలు డీఎస్పీ గారు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *