తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, డా. కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నరసరావుపేటలోని స్వగృహంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజ నిర్వహించారు.విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దర్శి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.