తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో దళిత, ముస్లిం,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి
జై భీమ్ రావు భారత్ పార్టీ
ప్రకాశం జిల్లా అధ్యక్షులు
KV కృష్ణారావు అధ్యక్షత వహించారు.
ఫిబ్రవరి 14 : 2026 తేదీన ప్రకాశం జిల్లా సింగరాయకొండ నవోదయ చైతన్య కోచింగ్ సెంటర్ నందు కనిగిరి కి చెందిన 11 సంవత్సరాల తౌశిక్ అనే పిల్లవాడు హత్య గావించబడి నేటికీ 7 నెలలు పూర్తి అయినా ఆ పిల్లవాడి హత్యకు సంబంధించిన దోషులను శిక్షించలేదు ఎలాంటి FIR నమోదు చేయలేదు.
తౌశిక్ తల్లి మౌలాభి గత ఏడు నెలల నుంచి పోలీసు వారి చుట్టూ ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ తిరిగి విసిగి యేసాగి 15 రోజులు నిరాహార దీక్ష చేసి స్కూలు యాజమాన్యం వారితో అనేక దుర్భాషలు ఎదుర్కొని చివరకు విసిగిపోయి 10 తేదీ తన కుమారుడు మరణించిన స్కూలు దగ్గర గడ్డి మందు త్రాగగా, ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్కు తరలించగా, అక్కడ వారు మెరుగైన చికిత్స అందించలేకపోగా హైదరాబాదు AIG హాస్పిటల్కు తరలించారు, 12వ తేదీ ఉదయం 6 గంటలకు మౌలాలి మృతి చెందింది.
మౌలాభి మృత దేహాన్ని స్థానిక పోలీసు వారు అక్కడే పోస్ట్మార్టం చేసి తీసుకువెళ్లాలని కోరగా మృతురాలైన మౌలాభి కుటుంబ సభ్యులు మౌలాభి మృతదేహానికి పోస్టుమార్టం ఒంగోలు కానీ, కందుకూరు లేదా కనిగిరి పట్టణాలలో నిర్వహించాలని పట్టుబట్టగా, 13వ తేదీ మధ్యాహ్నం వరకు హైడ్రామా నిర్వహించి, మృతదేహాన్ని AIG హాస్పిటల్ వారు కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా, హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ కు తరలించారు 14వ తేదీ పోస్టుమార్టం నిర్వహించి పోలీసు వారి ఆధీనంలో బాధితురాలు అయిన మౌలాలి మృతదేహాన్ని వారి స్థానిక పట్టణమైన కనిగిరి కి చేర్చి అక్కడి నుంచి నేరుగా స్మశానానికి తరలించాలని ఎంతో హై డ్రామా నిర్వహించారు. తుదకు ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, ఉద్రిక్తత వాతావరణం లో 15వ తేదీ సాయంత్రం మత ఆచారం ప్రకారం కనణం చేయడం జరిగినది.
ఈ యొక్క పోలీసువారు, విద్యాశాఖ మరియు పాలకవర్గం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా టంగుటూరు ట్రంక్ రోడ్డు నాలుగు రోడ్ల సెంటర్ నందు ప్రజా సంఘాలు మరియు ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాధిత కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, పది ఎకరాల భూమిని, కోటి రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగినది,
దోషులైన స్కూల్ యాజమాన్యం వారిపై వెంటనే క్రిమినల్ కేసులు బనాయించి రిమాండ్ కి పంపించవలసిందిగా డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత పోలీసు మరియు విద్యాశాఖ అధికారులను కూడా దోషులుగా పరిమిలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కు పంపించి, ఎంక్వయిరీ చేసి మృతులైన తౌశిక్ మరియు మౌలాబీల మరణాలకు న్యాయం చేయవలసిందిగా కోరినారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు “మొగల్ కాలేశా బేగ్”, AITUC నాయకులు “ప్రభాకర్”, CITU నాయకులు “రాము”, CPI నాయకులు నూకతోటి పేరయ్య, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు “తుల్లిబిల్లి అశోక్ బాబు”, T శ్రీకాంత్,ముస్లిం నాయకులు జబ్బర్, కాసిం వలి,JBP ప్రకాశం జిల్లా కార్యదర్శి జువిగుంట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ “బొడ్డు సతీష్”, T క్రాంతి, టు వీలర్ మెకానిక్ అసోసియేషన్*మండల అధ్యక్షులు “కసుకుర్తి శివకుమార్”, ప్రజాస్వామ్యవాదులు బొడ్డు శ్రీనివాసరావు, సుదర్శన్, మస్తాన్, ఖాదర్, బుడే,నాగూర్ మరియు దళిత నాయకులు ముస్లిం సోదరులు తదితరులు హాజరయ్యారు.