కనిగిరి,కందుకూరు, కొండపి నియోజకవర్గాల పరిధి లోని పాకల సముద్ర తీరంలో వినాయక నిమజ్జనోత్సవం లో పాల్గొని తిరిగి వెళ్లే వాహన దారులు పోలీస్ సూచనలు తప్పక పాటించాలని సింగరాయకొండ సిఐ శ్రీహరి పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా కి వివరిస్తూ
కనిగిరి, కందుకూరు, కొండేపి నియోజకవర్గాల వైపు నుండి నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు పాకల సముద్ర తీరానికి పాకల రైల్వే గేట్ (వయా టి పి నగర్) మీదగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలన్నారు. విగ్రహాల నిమజ్జనం ముగిసిన అనంతరం తిరిగి వెళ్లే వారు ఊళ్ళ పాలెం గ్రామం మీదుగా రైల్వే బ్రిడ్జి పై నుండి తిరిగి కనిగిరి కందుకూరుకు వెళ్లాలన్నారు. అదే విధంగా
అలాగే టంగుటూరు వైపు నుండి వచ్చే విగ్రహాలను రావివారి పాలెం గ్రామము మీదగా వచ్చి నిమజ్జనం ముగించుకుని అదే రూట్ లో తిరిగి టంగుటూరు వెళ్లాలని కోరారు. వినాయక నిమజ్జనానికి వచ్చే సమయంలో మద్యం సేవించి సముద్ర తీరానికి ఎవరూ రాకూడదని సి ఐ భక్తులు, నిమజ్జన వాహన పర్యవేక్షకులను ఆయన కోరారు. వినాయక నిమజ్జనానికి
సాయంత్రం 6 తర్వాత వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ప్రతి ఒక్కరూ గమనం లో ఉంచుకోవాలన్నారు.
సముద్ర తీరంలో చిన్న పిల్లలు మునిగేందుకు అనుమతి లేదని అన్నారు.
విగ్రహాల ఊరేగింపు సందర్భంగా వాహనాల తో ఎటువంటి డీజే లకు అనుమతి లేదని సి ఐ హెచ్చరించారు.
నిమజ్జనానికి వచ్చే వాహనాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని వాహనం నందు సరిపడిన మనుషులను మాత్రమే ఎక్కించుకు రావాలన్నారు.
నిమజ్జనానికి వచ్చే వాహనాల ను వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతం లో నిలుపుకోవాలన్నారు.
నిమజ్జనానికి వచ్చే వ్యక్తులు ఎలాంటి బంగారు వెండి ఆభరణాలు ధరించి రాకూడదు మీ సామాన్లకు మీరే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.
మద్యం సేవించి నిమజ్జనోత్సవంలో పాల్గొనే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించిన వారు నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వానికి అపరాధం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *