కందుకూరు పట్టణంలో ప్రజా సంఘాలు – ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమాన స్థితిలో మరణించిన కౌశిక్ — మృతికి కారణాలుతెలియజేయాలని పోరాడుతూ చనిపోయిన మౌలాబి కుటుంబానికి మద్దతుగా కందుకూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద సభ జరిగింది ఈ సభకు ఆవాజ్ నాయకులుఎస్సే గౌస్ అధ్యక్షత వహించారు ఈ సభను ఉద్దేశించి లౌకిక పరిరక్షణ వేదిక నాయకులు కోటయ్య గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమస్యల పైన అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అదే సందర్భంలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఉందని మౌలాలి ఘటన పరిశీలిస్తే పూర్తిగా న్యాయం జరగలేదనిపిస్తుందని తెలియజేశారు ఈ సభలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షష్టి మాట్లాడుతూ సింగరాయకొండ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా అనేక అనుమానాలకు తావిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తప్పులు చేసిన వారిని శిక్షించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం నాయకులు రూబీ, షేక్ రహీం, అబ్దుల్లా ఎస్.కె సందాని ముస్తఫా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా నాయకులు ఎస్.కె సుల్తానా పట్టణ కార్యదర్శి ఎస్కె మల్లిక బి ధనలక్ష్మి ఎస్ కే షాహిదా ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు జి లలితేష్ ఎస్కే రఫీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి ఎం రాయుడు గారు వివిధ ప్రజాసంఘాల నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు అనంతరం ర్యాలీగా కందుకూరు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన అర్జీని మీ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలియజేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *