తొలి శుభోదయం న్యూస్ కంభం:-
జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో కంభం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హజరత్ గూడెం లో తెలుగు పండిట్ గా పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కాబడి అవార్డు అందుకున్న శుభ సందర్భంగా ఎ. సరోజినీ మేడం గారిని వారి పాఠశాలలో సన్మానించడం జరిగినది. అలాగే జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేయబడి అవార్డు అందుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ గూడెం హెడ్మాస్టర్ ,ఎస్.డి .షబ్బీర్ గారిని మరియు , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావిపాడు లో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కాబడి అవార్డు అందుకున్న మధుసూదన్ గారిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కంభంలో సన్మానించడం జరిగినది. సన్మాన కార్యక్రమం నిర్వహించిన జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ సభ్యులు ,గౌరవ అధ్యక్షులు డాక్టర్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ ప్రపంచ మేధావులను తయారు చేసే గురువులను గౌరవించడం అందరి బాధ్యతఅన్నారు . అధ్యక్షులు వరుకుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమ సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ గదిలోని నాలుగు గోడల మధ్య ప్రపంచ భవిష్యత్తును నిర్మించే గురువులను గౌరవించడం ఎంతో సంతోషాన్నిస్తుంది అన్నారు. ఉపాధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణానికివిద్య పునాది మరియు ఆస్తి అన్నారు . అనంతరం సన్మాన గ్రహీతలు సరోజిని గారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకోవడం జీవితంలో మరువలేని మధుర జ్ఞాపకాలు అన్నారు విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడం మన బాధ్యత అన్నారు . హెడ్మాస్టర్ షబ్బీర్ గారు మాట్లాడుతూ వృత్తిపట్ల ప్రతి ఒక్కరు అంకితభావం మరియు కారదక్షిత కలిగి ఉండాలన్నారు . అప్పుడే మనం విజయాన్ని సాధించగలం అన్నారు . మధుసూదన్ గారు మాట్లాడుతూ మనం ఎంత ఎదిగిన అణిగిమనిగి ఉండడం మరియు జీవితంలో ఓర్పు సహనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ చచెకుముకి కన్వీనర్ షేక్ నాయబ్ రసూల్, కోశాధికారి షేక్ మస్తాన్, యూత్ నాయకుడు జావిద్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కంభం ఇన్చార్జ్ హెడ్మాస్టర్ వీరనారాయణ, ఉపాధ్యాయులు కేశవులు ,సోమశేఖర్, సుబ్బారావు, వరప్రసాద్, శివ నారాయణ ,సుజాత ,రవి , నంది రెడ్డి ,గఫూర్ ,లక్ష్మి ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.