కొండపి మండలం పెరదేపిలో వైసీపీని వీడి ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు కుటుంబాలు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి స్వామి గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో ప్రజలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *