తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా మార్కాపురం జిల్లా పోలీసులు కంభం చెరువు వద్ద డ్రోన్‌ పట్రోలింగ్‌ నిర్వహిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో భక్తులు, నిర్వాహకుల రాకపోకలు, శోభాయాత్రలు, వాహనాల రద్దీ తదితర అంశాలను డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు.జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాలు, రహదారులు మరియు పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.డ్రోన్‌ నిఘా ద్వారా పరిస్థితులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని సమన్వయంతో మోహరించి ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజల భద్రత, నిమజ్జన కార్యక్రమాల సజావు నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు ప్రజలు మరియు ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు కోరారు.టెక్నాలజీతో పటిష్ట నిఘా.. ప్రజల భద్రతే మార్కాపురం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *