టంగుటూరు మండలంలోని వల్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం “పోషణ మాసం 2026” మన అంగన్వాడి – మన భాద్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెక్టర్ సూపర్వైజర్ జి. జ్యోతి స్థానిక తల్లులతో అంగన్వాడి సేవలు గురించి వివరించారు. పోషకాహార లేమితో తల్లులు పిల్లల్లో ఎదురవుతున్న సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన తల్లులు, ఆరోగ్యమైన బిడ్డలు లక్ష్యంగా వెయ్యి రోజుల ప్రణాళిక రూపొందించాయన్నారు. ఆరోగ్యవంతమైన బాలికలు భారతదేశ భవిష్యత్తు అన్నారు. భావితరాల పిల్లల భవిష్యత్ కోసం ప్రతి బాలుడు, బాలిక కొరకు పోషకాహారం అందించడం, విద్యను పోత్సహించడం తల్లి మరియు శిశువు ఆరోగ్య సేవలు బలోపేతం చెయ్యడం, ఆటలతో అభ్యాసం,ఆరోగ్యకరమైన వికాసం, తల్లి గర్భం నుండి బిడ్డకు 2 సంవత్సరాల వయసు వచ్చేవరకు అంగన్వాడి కేంద్రాల్లో 1000 రోజులు పాటు తల్లులకు అందుతున్న సేవలు కల్పించబడుతున్న సౌకర్యాలను గురించి వివరించారు. అందరికి పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనం పోషక మాసం యొక్క ఉద్దేశమని సూపర్వైజర్ జి జ్యోతి స్థానిక తల్లులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ పరిధిలోని తల్లులు, వల్లూరు – 3 అంగన్వాడి కేంద్రం కార్యకర్త ఎస్. కళ్యాణి పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *