ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు విస్తృతంగా చర్యలు కొనసాగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పొన్నలూరు పోలీసులు చెన్నిపాడు గ్రామ శివారులోని సంగమేశ్వర ప్రాజెక్టు ప్రాంతంలో జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,670/- నగదు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా చెన్నిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పొన్నలూరు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో మరో జూద స్థావరంపై దాడి నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,380/- నగదు, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.మరో ఘటనలో దొనకొండ మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో దొనకొండ పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకుని, రూ.1,400/- నగదు మరియు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ మూడు వేర్వేరు దాడుల్లో మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకుని, రూ.7,450/- నగదు మరియు 10 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.జూదానికి చెక్‌.. అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసుల నిరంతర నిఘా!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *