తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా డ్రోన్ సర్వైలెన్స్.. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా దొనకొండ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రాంతంలో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు.నిమజ్జన ప్రాంతంలో ప్రజల రాకపోకలు, వాహనాల కదలికలు, జనసమ్మర్థం, ప్రమాదకర ప్రాంతాలు తదితర అంశాలను పరిశీలిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, నిరంతర నిఘా, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో దొనకొండ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.టెక్నాలజీతో పటిష్ట నిఘా.. భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం!