కురిచేడు – పేరంభట్లపాలెం వయా కాటంవారిపల్లె రహదారి అభివృద్ధికి రూ.3.30 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు డా గొట్టిపాటి లక్ష్మి డా కడియాల లలిత్ సాగర్ గార్ల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు , ప్రజలు , కూటమి శ్రేణులు పాల్గొన్నాయి.లక్ష్మి గారు మాట్లాడుతూ “ఓడిన చోటే గెలవాలి.. ప్రజలను గెలిపించాలి” అనే లక్ష్యంతో, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నాను.గత రెండేళ్లలో దర్శి నియోజకవర్గంలో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాం. ఇంకా మిగిలిన సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం.రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది” అని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *