తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
విధిగా పౌష్టికాహారం అందించాలి – సీడీపీఓ గర్భవతులు , బాలింతలు చిన్నారులకు విధిగా పౌష్టికాహారం అందించాలని టంగుటూరు ప్రాజెక్టు సిడిపిఓ అంజమ్మ అన్నారు. మండలంలోని బైరాగి మాన్యం అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మహా ఉత్సవాలను నిర్వహించారు . ఈ సందర్భంగా సిడిపిఓ గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం వలన కలిగే ఉపయోగాలను వివరించారు. ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ,విటమిన్లు ప్రోటీన్లు ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు చిరుధాన్యాల ఉపయోగం గురించి వారికి తెలిపారు అంగన్వాడీ కేంద్రంలో అందజేస్తున్న గుడ్లు, పాలు ఇతర పౌష్టికాహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా బాలింతలు గర్భిణీలకు అందజేస్తున్న పోషకాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ టి కుసుమ కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు ,గర్భిణీలు బాలింతలు ,చిన్నారులు పాల్గొన్నారు.