మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పామూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించనున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పామూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతన పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్‌లో భాగంగా జిల్లాలోని పోలీస్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలనే లక్ష్యంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భాగస్వామ్యంతో ఈ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పెట్రోల్ బంక్ కేవలం పోలీస్ సిబ్బందికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేయడం ఒక స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నందున, వాటికి ఇంధనం అత్యంత కీలకమైన అవసరమని ఎస్పీ గారు తెలిపారు. నూతన పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడంతో పోలీస్ వాహనాలకు సకాలంలో ఇంధనం లభించడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలాలకు మరింత వేగంగా చేరుకుని సమర్థవంతంగా స్పందించే అవకాశం కలుగుతుందన్నారు.పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ శాఖలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ పోలీస్ పెట్రోల్ బంక్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.ఈ కార్యక్రమంలో కనిగిరి ఇంచార్జి డిఎస్పీ పి.శ్రీధర్, పామూరు సీఐ వినోద్ కుమార్,పామూరు సీఐ రాజేష్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐ సీతారామిరెడ్డి, కనిగిరి సబ్ డివిజన్ ఎస్సైలు,ఎఆర్ ఎస్సై తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *