ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆత్మ శుద్ధి శారీరిక శుద్ధి కోసం ఆగమ శాస్త్రం ప్రకారం గ్రామ, సమాజ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 24 నుండి 27 వరకు స్వామి వారికి నిర్వహించే పవిత్రోత్సవాల లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పిలుపు ఇచ్చారు. సోమవారం ఆలయ ప్రాంగణం లోని చైర్మన్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇఒ రంగరాజు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ పవిత్రోత్సవాలలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేకంగ పాల్గొని స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.భక్తులు, అర్చకులు,ధర్మకర్తల మండలి, తెలిసి తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రక్రియ పవిత్రోత్సవాలు అని ఆయన వివరించారు. ఉభయ దాతలు, భక్తుల సహకారంతో నిర్వహించే పవిత్రోత్సవాల లో భక్తులు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా పాల్గొని తరించాలని కోరారు. ఈ నెల 24 తేదీన అంకురార్పణ తో పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 25 తేదీన పవిత్ర ప్రతిష్ఠ,26 పవిత్ర సమర్పణ, 27 తేదీన మహా పూర్ణాహుతి కార్యక్రమాలు విశేష పూజలు హోమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వహణ అధికారి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు కుంచాల రమణయ్య,అర్చకులు ఉద్యగిరి శేష లక్ష్మి నారసింహ చార్యులు, ఉదయగిరి నారసింహ చార్యులు, కొణిజె టి మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.